టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి కి బాలీవుడ్ స్టార్ హీరోలలో చాలా మంది తో కూడా మంచి స్నేహ బంధం ఉంది. ఇక చిరంజీవి కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్నేహితులలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇక సల్మాన్ ఖాన్ , చిరంజీవి స్నేహ బంధం చాలా సంవత్సరాల నుండి కొనసాగుతుంది. వీరిద్దరూ ఎంతో మంచి స్నేహితులు కావడంతో చిరంజీవి ఒక రోజు సల్మాన్ ను ఒక హెల్ప్ అడగగానే ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పని చేసి పెట్టాడట. అసలు చిరంజీవి , సల్మాన్ ను అడిగిన హెల్ప్ ఏమిటో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మూవీ మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకున్న లూసిఫర్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఒక రోజు ఈ సినిమా దర్శకుడు అయినటువంటి మోహన్ రాజా , చిరంజీవి తో ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో ఎవరైనా మంచి క్రేజ్ ఉన్న నటుడు నటించినట్లు అయితే మంచి క్రేజ్ ఉంటుంది అని చెప్పాడట. దానితో ఎవరు అయితే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు అని చిరంజీవి , మోహన్ రాజా ను అడిగాడట.
దానితో సల్మాన్ ఖాన్ అయితే ఈ పాత్రకు సూపర్ గా ఉంటుంది సార్ అని చెప్పాడట. దానితో వెంటనే చిరంజీవి , సల్మాన్ ఖాన్ కి ఫోన్ చేసి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ పాత్ర ఉంది. దానికి నువ్వైతేనే కరెక్ట్ గా న్యాయం చేయగలవు అని దర్శకుడు అనుకుంటున్నాడు. నువ్వు చేయగలగా అని అడిగాడట. దానితో వెంటనే సల్మాన్ ... నేను ఎప్పుడు రావాలి చెప్పండి అని అన్నాడట. ఇక చిరంజీవి కి ఇచ్చిన మాట ప్రకారం సల్మాన్ రావడం , నటించడం జరిగింది. ఇక ఈయన నటించడం ద్వారా ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. కాకపోతే ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట. చిరంజీవి పై అభిమానంతో మాత్రమే ఈ సినిమా చేసి వెళ్లిపోయాడట.