ఇంద్ర స్టోరీ మొదట ఏ బ్యాక్ డ్రాప్ లో రాశారో తెలుసా.. ఆయన ఎంట్రీతో మొత్తం చేంజ్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ మూవీలో ఆ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయినటువంటి ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా ... ఆ సమయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి బి గోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమాకు చిన్ని కృష్ణ కథను అందించాడు. ఈ మూవీ కథను మొదటగా బి గోపాల్ కి వినిపించగా ఆయనకు ఈ సినిమా కథ పెద్ద పెద్దగా నచ్చలేదట. అలాగే అశ్విని దత్ కి కూడా ఈ సినిమా కథ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదట. అలాంటి సమయంలో కథ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట. దానితో ఈ కథ విన్న గోపాల కృష్ణ ఈ సినిమా బాగానే ఉంటుంది. చిరంజీవిపై సూపర్ గా వర్కౌట్ అవుతుంది అని బి గోపాల్ కి చెప్పాడట. దానితో ఆయన కన్విన్స్ అయ్యాడట. కాకపోతే సినిమా కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేయాల్సి ఉంటుంది అని బి గోపాల్ , పరుచూరి గోపాలకృష్ణ కు సూచించాడట. దానితో అదే విషయాన్ని చిన్న కృష్ణ కు గోపాల కృష్ణ చెప్పాడట.

ఈ మూవీ కథను మొదట చిన్ని కృష్ణ గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాశారట. ఇక ఆ బ్యాక్ డ్రాప్ కాకుండా వేరే ఏదైనా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను తయారు చేయమని చిన్ని కృష్ణ కు బి గోపాల్ సూచించాడట. దానితో ఆయన కొంత సమయం తీసుకుని కాశీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా స్టోరీ ని తయారు చేశాడట. కాశీ బ్యాక్ డ్రాప్ లో తయారు చేసిన స్టోరీని వినిపించగానే బి గోపాల్ , అశ్విని దత్ , చిరంజీవి , గోపాల కృష్ణ అంతా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకానికి వచ్చారట. అలా మొదట గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాసిన ఈ కథను ఆ తర్వాత కాశి బ్యాక్ డ్రాప్ కి చేంజ్ చేసి రాశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: