ప్రియుడికి షాక్‌..ఆ రాజకీయ నాయకుడితో తమ్మన్నా ఎఫైర్‌ ?

Veldandi Saikiran
తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ కొనసాగిస్తోంది ఈ నటి. శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది హ్యాపీడేస్ సినిమాతో ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమా అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం తమన్నా ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తోంది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు కావడం విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ దూసుకుపోతోంది. అంతేకాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో తన సత్తాను చూపిస్తోంది. ఇక గత కొన్ని రోజుల నుంచి తమన్నా వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ చాలాసార్లు చట్టపట్టలేసుకొని కెమెరా కంటపడ్డారు. ఇక వారి ప్రేమ విషయాన్ని బహిరంగంగానే అనౌన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలలోనూ నటించారు. వీరు త్వరలోనే వివాహం చేసుకుంటారని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

రీసెంట్ గా వీరిద్దరూ విడిపోయినట్లు సోషల్ మీడియాలో ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. వీరిద్దరి బ్రేకప్ విషయంపై తమన్నా కానీ, విజయ వర్మ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా తమన్నా తాజాగా ఓ రాజకీయ నాయకుడితో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ఎఫైర్ పెట్టుకుందని, అంతేకాకుండా తరచూ ఆ రాజకీయ నాయకుడి ఇంటికి వెళుతుందని, వీరిద్దరూ కలిసి బయట కూడా తిరుగుతున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. తమన్నా ఎఫైర్ల విషయంలో చాలా రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. కానీ విజయవర్మతో మాత్రం ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్లు, వివాహం చేసుకుంటామని తమన్నా స్పందించింది. మరి ఈ రాజకీయ నాయకుడితో ఎఫైర్ వార్తలపై తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: