తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసిఆర్ సీఎంగా ఉన్నారు. వెనకబడ్డ రాష్ట్రాన్ని ముందుస్థాయిలోకి తీసుకువచ్చారు కానీ ఆయన కుటుంబ పాలనే చాలామందికి నచ్చలేదు. ఓకే కుటుంబం నుంచి కొడుకు, కూతురు, అల్లుడు, ఇలా కుటుంబ పాలనతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఈ తరుణంలో ఈ ముగ్గురు మీదనే రాష్ట్రమంతా ఆధారపడి ఉండడం మిగతా లీడర్లు మొత్తం వీరు చెప్పినట్టే వినడం, ఎవరికి నచ్చలేదు. అంతేకాకుండా కేసీఆర్ అహంకార ధోరణి కూడా ప్రజలకు నచ్చక మూడవసారి దారుణంగా ఓటమిపాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి దారణంగా తయారయింది. దీనికి తోడు లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఎన్నికలకు ముందు అరెస్ట్ కావడం, కనీసం ఆమెకు బెయిల్ దొరకపోవడం ఇదే సమయంలో పార్టీ ఓడిపోవడం అన్ని ఒకేసారి కేసీఆర్ శాపంలా చుట్టుకున్నాయి.
ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కవితకు బెయిల్ దొరకడం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు ఇతర కీలక లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇలా కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ పడటంతో, చాలా ఇబ్బందులు పడుతున్నారట. ఇదే తరుణంలో కేసీఆర్ సరికొత్త ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. కవితను బయటకు తీసుకురావాలంటే బిజెపి పార్టీ సపోర్ట్ కావాలి. అంతేకాకుండా పార్టీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇక అన్ని విధాల ఆలోచనలు చేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేయాలనుకుంటున్నారట. ఇదే విషయమై బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక లీడర్లు కర్ణాటకలో కీలక లీడర్ అయినటువంటి డీకే శివకుమార్ ను కలిశారట. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేది ఆపకపోతే పార్టీ మొత్తం బిజెపిలో విలీనం చేస్తామని చెప్పారట.
ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కూటమిలాగా ఏర్పడి చంద్రబాబు గెలిచారో, ఆ విధంగానే మేము కూడా బిజెపిలో విలీనం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని అన్నారట. వెంటనే రేవంత్ రెడ్డి చేరికలను ఆపాలని చెప్పారట. ఒకవేళ రేవంత్ రెడ్డి అలాగే చేస్తే మాత్రం బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తే అటు కవిత జైలు నుంచి బయటకు వస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీని ఓడించొచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట. మరి చూడాలి రేవంత్ రెడ్డికి అధిష్టానం వలసలు ఆపాలని ఆలోచన ఇస్తుందా? లేదంటే అలాగే కొనసాగించు అని ధైర్యం చెబుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.