హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మణులతో ఆలియా భట్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకొని హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ తర్వాత వరుస పెట్టి ఈమెకు బాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ నటి హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం జీగ్రా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాలను నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఈ బ్యూటీ రామ్ చరణ్ కు జోడిగా నటించగా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి ఈ సినిమా ద్వారా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని రంగాల్లో పెట్టుబడులను పెట్టి కూడా పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం ఓ రంగంలో ఐదు కోట్ల రూపాయలను పెట్టు బడి పెట్టగా అది అద్భుతమైన రీతిలో గ్రో అయినట్లు తెలుస్తుంది. దానితో ఈమెకు తక్కువ కాలం లోనే 54 కోట్ల డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. అలా ఆలియా సినిమాల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని రంగాల్లో పెట్టు బడులు పెట్టడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.