గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్ రివ్యూ.. థమన్ అన్న ఇలా చేయడం మీకు న్యాయమా?

Reddy P Rajasekhar
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. జనవరి నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. తాజాగా ఈ సినిమా నుంచి దోప్ సాంగ్ విడుదలైంది.
 
అయితే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ మరీ ఆహా ఓహో అనేలా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ శంకర్ 2.0 సినిమా సాంగ్ ను గుర్తు చేసేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థమన్ అన్న పాన్ ఇండియా మూవీ అయిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఇలాంటి సాంగ్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
 
దోప్ సాంగ్ లో చరణ్, కియారా డ్యాన్స్ స్టెప్స్ మాత్రం అదుర్స్ అనేలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా ఏకంగా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. డైరెక్టర్ శంకర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.
 
గేమ్ ఛేంజర్ మూవీ కమర్షియల్ రేంజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ రేట్ల పెంపు ఉంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించడం మెగా ఫ్యాన్స్ కు సైతం కీలకమనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: