కల్కి 2898 AD : 8 రోజుల్లోనే అంతా క్లోజ్.. ఇకపై టార్గెట్ కేవలం అది మాత్రమే..?

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందింది. ఇందులో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాగూర్ , శోభన , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ముఖ్య పాత్రలలో నటించగా ... దీపికా పదుకొనే , అమితా బచ్చన్ కీలక పాత్రలలో నటించారు. జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 8 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 71.06 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 16.32 కోట్లు , ఉత్తరాంధ్రలో 16.38 కోట్లు ,  ఈస్టు లో 9.70 కోట్లు ,  వెస్ట్ లో  7.29 కోట్లు ,  గుంటూరు లో 8.84 కోట్లు ,  కృష్ణ లో 8.73 కోట్లు ,  నెల్లూరు లో 4.61 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 142.84 కోట్ల షేర్ ... 221.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 23.20 కోట్లు , తమిళ నాడు లో 14.35 కోట్లు , కేరళలో 7.69 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 84.40 కోట్లు , ఓవర్ సీస్ లో 89.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 361.41 కోట్ల షేర్ ... 694.29 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 10.59 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ రోజుతో ఈ సినిమా బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయితే ఈ సినిమా టార్గెట్ ఇక భారీ మొత్తంలో లాభాలు అందుకోవడమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: