ఆ హీరోయిన్‌ను చిరంజీవి ముద్దు పేరుతో పిలించే వారట.. ఏమనో తెలుసా?

Suma Kallamadi
సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. వెండితెరపై కనిపించే నటీనటులను ప్రేక్షకులు ఎంతగానో ఆరాధిస్తారు. ఇక హీరోల విషయానికొస్తే చిరంజీవి చిన్న నటుడిగా ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్‌గా ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరోవైపు సినిమాలో కొన్ని జంటలు అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందులోనూ హీరోయిన్లకు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారితో నటించిన హీరోలు కూడా వారిని ప్రత్యేకంగా అభిమానిస్తారు. 90లలో హీరోయిన్లు అందంతోనే కాకుండా అభినయంతోనూ ప్రేక్షకులను సంపాదించుకునేవారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన తన కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. అయితే వారిలో ఆయనకు సౌందర్య అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆమెను భావిస్తారు. అలాంటి సౌందర్యను చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే వారు. ఆమె నటనతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా చిరంజీవికి తెగ నచ్చేవి. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

చాలా మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన కాలంలో వారితో నటించిన హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారనే ఆరోపణలు వస్తుంటాయి. అయితే చిరంజీవికి మాత్రం అలాంటివి ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆయన సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. వారిలో సౌందర్య అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఆమెను సౌ అని ముద్దు పేరుతో చిరంజీవి పిలిచేవారు. ఈ విషయం ఆయన భార్య సురేఖకు కూడా తెలుసు. సౌందర్యను తమ ఇంట్లో మనిషిగా భావించి, ఆయన ఎంతో గౌరవం ఇచ్చే వారు. ఇండస్ట్రీలో రారాజు అయిన చిరంజీవి తనను ఎంతో ముద్దుగా సౌ అని పిలిస్తే సౌందర్య మురిసి పోయే వారట. సినీ ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత ఆ స్థాయిలో నటనలోనూ, నడవడికలోనూ సౌందర్యకు మంచి పేరు ఉండేది. ఫ్యాషన్ డ్రెస్సులతో వెండి తెరపై రమ్య కృష్ణ, రంభ ఆకట్టుకునే రోజుల్లోనూ సౌందర్య పద్ధతిగా చీర కట్టుకుని నటించే వారు. తన అందంతో కాకుండా కేవలం తన నటనతోనే ఆమె ప్రేక్షకులను కట్టి పడేసే వారు. అలాంటి సౌందర్య అకాల మరణం ఎంతో మందిని క్రుంగదీసింది. పెళ్లైన కొన్ని రోజులకే ఆమె బీజేపీలో చేరారు. ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: