హోస్ట్ గా మారబోతున్న మరో తెలుగు స్టార్ హీరో..ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్ధలు అయిపోవాల్సిందే..!?
ఇప్పటివరకు నటుడిగా మాత్రమే కాకుండా, తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను మెప్పించిన సిద్దు, ఇప్పుడు హోస్ట్‌గా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. బాలకృష్ణ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో తరహాలోనే, మరో అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోను సిద్దు జొన్నలగడ్డ హోస్ట్ చేయబోతున్నారట. ఈ షో పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటరాక్టివ్ కంటెంట్‌తో రూపొందించనున్నారని టాక్.ఈ మేరకు సిద్దు జొన్నలగడ్డతో ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ అధికారిక ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే సంక్రాంతి నాటికి ఈ కొత్త నాన్-ఫిక్షన్ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని, భారీ స్థాయిలో ఈ షోను లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ షోలో హోస్ట్‌గా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్న తీరు ప్రత్యేకంగా ఉండనుందని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ యాస, భాష ఉట్టిపడేలా, సహజమైన మాటతీరుతో ఈ షో సాగనున్న అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిద్దు ఇప్పటికే తన సినిమాల్లో తెలంగాణ స్లాంగ్‌ను అద్భుతంగా ఉపయోగించి మెప్పించిన విషయం తెలిసిందే. అదే స్టైల్‌ను ఈ షోలో కూడా కొనసాగిస్తే, ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ, ఇప్పుడు హోస్ట్‌గా కూడా ఓ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ షో గనక అనుకున్న విధంగా క్లిక్ అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టీఆర్పీ రేటింగ్స్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సిద్దు అభిమానులు మాత్రం ఈ అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.