ప్రభాస్: అక్కడ కూడా మన డార్లింగే టాప్?

Purushottham Vinay
ప్రభాస్: అక్కడ కూడా మన డార్లింగే టాప్?

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. ఇక బాహుబలి 2 సినిమాతో దేశావ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌.ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ప్రభాస్ ప్రతీ సినిమాకు బ్రహ్మరథం పడుతునే ఉన్నారు.ఇప్పుడు కల్కికి ఫిదా అవుతున్నారు బాలీవుడ్ జనాలు.. ఈ సినిమా  కలెక్షన్స్ పెరుగుతునే ఉన్నాయి. ఒక రోజుకి మించి మరో రోజు అన్నట్టుగా.. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి.. బాలీవుడ్‌లో మొత్తం నాలుగు రోజుల్లో 115 కోట్లు కొల్లగొట్టింది కల్కి. ఇప్పుడు ఆరు రోజుల్లో ఏకంగా 145 కోట్ల రూపాయల వసూళ్ళని కొల్లగొట్టింది.


బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల జాబితాలో ‘బాహుబలి 2- ది కన్‌క్లూజన్’ హిందీలో దక్షిణాదిలో అతిపెద్ద వసూళ్లు సాధించడమే కాకుండా, ‘జవాన్’, ‘గదర్ 2’ , ‘పఠాన్’ తర్వాత నాల్గవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. రెండవ స్థానంలో, యష్  KGF: చాప్టర్ 2 ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల rrr మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికి కల్కి చిత్రం 6 రోజుల్లో హిందీలో 145 కోట్ల రూపాయలను దాటింది. అంటే త్వరలో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు చిత్రాల జాబితాలో ప్రభాస్ కల్కి చిత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోవడం ఖాయం. ప్రభాస్ కల్కితో టాప్ 3 స్థానానికి చేరుకోవాలంటే RRRని బీట్ చేయాలి. ఈ సినిమా హిందీ వసూళ్లు 272 కోట్లు. ఇక యష్ kgf 2 టాప్ 2 స్థానాన్ని ఆక్రమించింది. దీన్ని బద్దలు కొట్టాలంటే ఖచ్చితంగా రూ.435 కోట్లకు పైగా వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ‘బాహుబలి 2’ టాప్ పొజిషన్‌ను అందుకోవాలంటే ‘కల్కి’ రూ.511 కోట్లకు పైగా రాబట్టాలి. కల్కి దూకుడు చూస్తుంటే వసూలు చేసేలాగే ఉంది.. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 తో ఇంకా అక్కడ టాప్ హీరోగానే కొనసాగుతున్నాడు. చూడాలి కల్కితో తన రికార్డ్ తాను బద్దలు కొడతాడో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: