ఏపీ: టిడిపి ఆఫీస్ పై దాడి..మంగళగిరిలో హై టెన్షన్..!

Divya
నారా లోకేష్ భారీ విజయంతో ఈసారి మంగళగిరి ఎన్నికలలో గెలవడం జరిగింది. దీంతో మంగళగిరిని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తారని కూడా తెలియజేశారు. అయితే గతంలో మంగళగిరిలోనే టిడిపి కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినటువంటి సంఘటన పైన..నిన్నటి నుంచి పలువురిని ఈ కేసు పైన అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ దాడి ఘటన పైన మరిన్ని ఆధారాలు సేకరించడానికి అక్కడ పోలీస్ అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ దాడిలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య అజ్ఞాతంలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. టిడిపి కేంద్ర కార్యాలయం అక్టోబర్ 19.. 2021న దాడి చేశారట .అయితే ఈ కేస్కో సంబంధించి విచారణ ఇప్పుడు మరింత వేగవంతం చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే నాలుగు బృందాలని సైతం రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే నిందితులను సైతం అరెస్టు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. సీసీ ఫుటేజ్ ఇతర ఆధారాలతో ఆరోజు దాడికి పాల్పడిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పసిగట్టిన కొంతమంది వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

గుంటూరు విజయవాడ మంగళగిరి కి చెందిన కొంతమంది స్థానిక వైసీపీ నేతలను విచారించబోతున్నట్లు సమాచారం. వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన చైతన్య సహకారంతోపాటుగా కొంతమంది రౌడీషీటర్ల సహాయంతో ఈ దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు దీని వెనుక ఉన్నది ఎవరనే విషయం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిందితులు అప్పట్లో ఎవరెవరి కార్లలో వచ్చారు వారికి సహకరించింది ఎవరు అనే విషయం పైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ముద్దాయిని కనుక్కోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి నేతలు.. మరి ఈ విషయం పైన మంగళగిరిలో కాస్త హై టెన్షన్ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: