విక్రమ్ 'తంగలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్..!?

Anilkumar
సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో తంగలాన్ సినిమా కూడా ఒకటి. తమిళ స్టార్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రంజిత్ దర్శకత్వంలో రాబోతోంది. కబాలి కాలా సర్పట్ట పరంపర వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే

 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు సినీ ఆడియన్స్. ఇకపోతే మొదట ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తాము అని అన్నారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేస్తామని అన్నారు. కానీ ఆ తేదీ కూడా ఫిక్స్ కాలేదు. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  ఈ మూవీని ఇండిపెండెన్స్

 కానుకగా ఆగష్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆగష్టు 15 రేసులో ఉన్న పుష్ప 2 డిసెంబర్‌కు వాయిదా పడగా.. ఆ స్థానంలో రామ్- పూరీ కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్ వస్తుంది. ఇక ఆగష్టు 15 కి తంగలాన్ కూడా వస్తే బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: