అక్కడ అమ్మఒడి విఫలం.. 7 గురు విద్యార్థులకు 7 గురు టీచర్లు..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ బడి అనే పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ప్రకారం స్కూల్ లలో మధ్యాహ్న భోజనాన్ని పెడతారు. ఇక మొదట ఇది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉండేది. ఆ తర్వాత దీనిని ప్రైవేట్ పాఠశాలలో కూడా అమలు చేయడం మొదలు పెట్టారు. ఇలా మధ్యాహ్నం మంచి భోజనాన్ని విద్యార్థులకు పెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.

కానీ ఈ పథకం ద్వారా పెద్దగా ప్రయోజనం జరగట్లేదు అని , ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మధ్యాహ్న భోజనం ఉచితంగా ఇవ్వడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. అసలు విషయంలోకి వెళితే ... శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం పెద్ద కొజ్జారియా జిల్లా పరిషత్ స్కూల్ లో ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు టీచర్లు పనిచేస్తున్నారు.

వైసిపి ప్రభుత్వం స్కూల్లో విలీనం పేరుతో తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఇక పోయిన సంవత్సరం ఈ స్కూల్ ను 22 మంది విద్యార్థులతో నడిపారు. వారిలో పదవ తరగతి పూర్తి చేసుకుని నలుగురు విద్యార్థులు ఈ సంవత్సరం స్కూలు నుండి వెళ్లిపోయారు. దానితో ఈ స్కూల్లో 18 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు.

ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 11 మంది టీసీ లు తీసుకొని వెళ్లారు. దానితో ఏడుగురు మాత్రమే ఈ స్కూల్ లో మిగిలారు. ఇప్పుడు మూడో తరగతిలో ఒక్కరూ , నాలుగో తరగతిలో ఇద్దరు , ఆరో తరగతిలో ఒకరు , ఏడో తరగతిలో ముగ్గురు మాత్రమే మిగిలారు. ఇక ప్రస్తుతం ఈ ఏడుగురు విద్యార్థులతో ఈ స్కూల్ ను నడుపుతున్నారు. ఇక ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెట్టి ఎన్నో వసతులు కల్పించినా కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు స్కూల్ లకే పంపడానికే ప్రముఖ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: