బంపర్ ఆఫర్ పట్టేసిన కృతి శెట్టి.. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ తో..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇటీవల మనమే సినిమాతో మంచి క్లాస్ విజయాన్ని అందుకుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఈమె కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత తనకి వరుస సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. ఉప్పెన సినిమా తర్వాత ఏకంగా టాలీవుడ్ నాచురల్ స్టార్ నానితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

నాని హీరోగా నటించిన శ్యాంసింగ రాయి సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ బ్యూటీ. ఇక తన రెండవ సినిమాలోని కాస్త బోల్డ్ గా కనిపించడంతో తనపై పలు విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకుని కృతి ఈ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో నటించింది. అలా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక  ఈ సినిమాల తర్వాత వరుస సినిమాల్లో నటించినప్పటికీ అన్ని సినిమాలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి .ఇందులో భాగంగానే వరుస ప్లాప్స్ రావడంతో సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన

 ప్రతి శెట్టి మళ్ళీ ఇటీవల మనమే సినిమాతో వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ హీరో సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు...దుల్కర్.  మళయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో అభిమానులు గట్టిగానే ఉన్నారు. ఇక్కడ వరస సినిమాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా దుల్కర్ సల్మాన్ ని అన్ని మీడియాలు పొగుడుతూంటాయి. అందుకు తగ్గట్లే సినిమాలో ఆయన నటనే హైలెట్ గా సాగుతూంటుంది. మొదట్లో మళయాళ చిత్రాలు మాత్రమే చేసినా ఇప్పుడు తెలుగులో ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆ డబ్బింగ్ వెర్షన్స్ ఎలాగూ తన మాతృభాషకు వెళ్తాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: