కాంగ్రెస్ లో కల్లోలం...కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ మధ్య గొడవలు?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో.. రేపు లేదా ఎల్లుండి కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకిపయనమయ్యారు. అయితే కేబినెట్ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఆశావాహులందరూ... అధిష్టానం ముందు తమ గోడు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వస్తాయని చెబుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్...  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి  మధ్య వార్ జరుగుతుంది. ఈసారి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని... అందరూ అనుకుంటున్నారు. అయితే దీనికి ఉత్తంకుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే...  తన భార్యకు కూడా మంత్రి  ఇవ్వాలని ఉత్తంకుమార్ రెడ్డి  అధిష్టానాన్ని అడుగుతున్నారట.

ఇప్పటికే మంత్రులుగా ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే ఇంట్లో మళ్లీ మంత్రి పదవులు.. ఇవ్వకూడదని కాంగ్రెస్ అనుకుంటోందట. కానీ మంత్రి పదవి కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి తగ్గట్టుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి... లాబీంగ్ చేస్తున్నారని సమాచారం.

మొత్తానికి... ఈ కేబినెట్ విస్తరణ....  కాంగ్రెస్ పార్టీలో పెద్ద  కల్లోలమే సృష్టిస్తోంది. ఇది ఇలా ఉండగా... ఈసారి కేబినెట్ విస్తరణలో ఐదుగురికి ఛాన్స్ ఇవ్వనున్నారట. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి, ప్రభుత్వ విప్పులు, అలాగే టీపీసీసీ చీఫ్‌ పదవులపై రేపు ఓ నిర్ణయం తీసుకోనుందట కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.  టీపీసీసీ చీఫ్‌ గా మధు యాష్కీ లేదా మహేష్‌ గౌడ్‌ ఫైనల్‌ అవుతారని తెలుస్తోంది. మధు యాష్కీ లేదా మహేష్‌ గౌడ్‌ ఇద్దరి లో ఎక్కువగా మహేష్‌ గౌడ్‌ కు ఛాన్స్‌ ఇచ్చేలా కనిపిస్తోందని సమాచారం. అటు బీఆర్ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పోచారం కు డిప్యూటీ స్పీకర్‌ పదవి రానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: