"కుంగువా" మూవీ రిలీజ్ ఉంటుందా.. తెలుగులో ఇద్దరు.. తమిళ్లో ఒక్కరు..?

MADDIBOINA AJAY KUMAR
తమిళ నటుడు సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని చాలా భాషలలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీపై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకులు మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంత భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను తాజాగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసినప్పటి నుండే సరికొత్త ప్రాబ్లం ముందుకు వచ్చింది.

అది ఏమిటి అంటే ... ముఖ్యంగా సూర్యకు తమిళ్ తో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ సినిమా విడుదల అవుతున్న సమయంలో తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న వెట్టయాన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల నుండి రజిని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక అదే తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఒక వేళ పెట్టాయన్ మూవీ అదే తేదీన విడుదల అయితే ఈ సినిమాకు తమిళ్ లో భారీ ఎదురు దెబ్బ తగిలి అవకాశం ఉంది. ఇక తెలుగులో మంచి క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "ఎన్ బి కే 109"  రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమాలను కూడా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఒక వేళ ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అక్టోబర్ లో విడుదల అయిన ఆ మూవీ ద్వారా కూడా కంగువా కు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి దెబ్బ తగిలి అవకాశం ఉంది. ఇక ఇంత రిస్క్ ఉన్నా కూడా కంగువా ను అదే తేదీన విడుదల చేస్తారా ..?  లేక విడుదల తేదీని ఏమైనా మారుస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: