నియంతలా అనుకున్న KCR ని నువ్వెంత అనేలా తొక్కేసిన ప్రజాస్వామ్యం?

Purushottham Vinay

•నియంతలా అనుకున్న kcr ని నువ్వెంత అనేలా ఓడించిన ఓటర్లు


•BRS ని పాతాలానికి తొక్కేసిన కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణ - ఇండియా హెరాల్డ్: పదేళ్లు తెలంగాణకు తాను నియంత అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్‌ ఇంకా అతని కుటుంబాన్ని ప్రజాస్వామ్యంతో తమకున్న ఓటు అనే ఆయుధంతో కిందకు దించారు తెలంగాణ ప్రజలు. అయితే ఓటమి తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నేతల్లో అహంకారం తగ్గలేదు. ఈ తీరే జనాలకు నచ్చడం లేదు.ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన స్కామ్‌లు, కుంభకోణాలను వెలికితీయడం మొదలు పెట్టగా బీఆర్‌ఎస్‌ పై జనాల్లో నెగటివ్ ఫీలింగ్ అనేది డబుల్ అయ్యింది. ఇంకా మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఢిల్లీ లిక్క స్కాం కేసులో కీలకంగా ఉన్న కేసీఆర్‌ కూతురును అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇది కూడా బీఆర్‌ఎస్‌ కి మాయని మచ్చ లాగా అయిపోయింది. పైగా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు ఇక ఆ పార్టీలో భవిష్యత్‌ లేదని కాంగ్రెస్, బీజేపీబాట పట్టారు.ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావించారు. దీంతో ఆయనే స్వయంగా బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. 


కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వం చేసిన అన్ని కుంభకోణాలను అనతికాలంలోనే బయటపెట్టి నెగటివ్ చేసేసింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘోరమైన ఓటమికి ప్రధాన కారణమైంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రధాని మోదీ వేవ్‌ బాగా పనిచేసింది. కవితను అరెస్టు చేయకుండా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గట్టిగా పుంజుకుంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక దారుణంగా ఓడిపోయింది.ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్ పతనానికి కంకణం కట్టుకున్నాయి.ఈ రెండు జాతీయ పార్టీలో దూకుడును ఉదుర్కొనేందుకు కేసీఆర్‌ ఎంత ప్రయత్నం చేసినా కానీ తెలంగాణ ఓటర్లు బీఆర్‌ఎస్‌ను పక్కకి తోసేశారు. ఇక బీఆర్‌ఎస్‌ను గెలిపించినా లాభం లేదన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు. ఆ పార్టీ సున్నా సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇలా బీఆర్ఎస్ పతనం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: