శ్రీరెడ్డి : జగన్ ఘోర ఓటమి..తక్కువ అంచనా వేయకండిరా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుంది వైసిపి పార్టీ. అటు నాలుగు అంటే నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ పార్టీకి దక్కాయి. దీంతో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలింది. మూడు రాజధానులు అంశం, ల్యాండ్ టైటిలింగ్... రోడ్ల మరమ్మత్తులు చాలా అంశాల నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
దీంతో ఏపీ ప్రజలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమిపై... టాలీవుడ్ వివాదాస్పద నటి... శ్రీ రెడ్డి స్పందించారు. వైసిపి పార్టీ గెలిచిన... ఓడిపోయిన... జగనన్నను తక్కువ అంచనా వేయకండి అంటూ శ్రీరెడ్డి తెలిపారు. ఎవరు బాధపడకూడదు.... ఎత్తండి రా తల ఎగురవేయండిరా కాలర్... అంటూ వైసీపీ పార్టీ కార్యకర్తలకు అలాగే నేతలకు బూస్ట్ ఇచ్చారు శ్రీరెడ్డి.
వైసీపీ కార్యకర్తలు అలాగే నేతలు అందరూ చాలా ధైర్యంగా ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని పథకాలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ అందించిందని... కానీ తెలుగుదేశం కూటమి ఇప్పుడు ఏం చేయలేదన్నారు. ఓటమి బాధలో ఉన్న జగన్కు ఇప్పుడు అండగా ఉండాలని కోరారు శ్రీరెడ్డి. అంతేకాదు జై వైయస్సార్సీపి అంటూ పోస్ట్ పెట్టారు నటి శ్రీరెడ్డి. కాగా టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. మొదటి నుంచి వైసీపీ పార్టీకి అండగా నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వైసిపి పార్టీకి అనుకూలంగా నిత్యం పోస్టులు పెడుతూనే ఉంటుంది శ్రీరెడ్డి. అదే సమయంలో తెలుగుదేశం అలాగే జనసేన నేతలపై విరుచుకుపడుతూ ఉంటుంది.