చంద్ర బాబు: ఆంధ్రా కి హోదా తీసుకువస్తారా..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున విడుదలై కూటమి భారీ విజయాన్ని అందుకుంది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు పరిశ్రమలు కంపెనీలు రాక చాలా సతమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం పైన ఎన్నోసార్లు నేతలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు వచ్చేకి అవకాశం ఉన్నది.. 2014వ సంవత్సరంలో ఏదైతే విభజన చట్టంలో పెట్టకపోవడం వలన అది సాధ్యం కాలేదట. పార్లమెంటులో ఇచ్చిన హామీ కాబట్టి అది అవ్వలేదు..

వీటికి తోడు నీతి అయోగ అప్పుడు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు.. 55: 45 ఉన్నది అయితే అంతకుముందు 90% నిధులు ఎటు 10% అటు అన్నట్లుగా ఉండేది.. హోదా వస్తే 90% నిధులు కేంద్రానికి 10 శాతం రాష్ట్రానివి ఉంటాయి. అలాంటి దాన్ని ఇప్పుడు 55: 45 కి మార్చేశారు.. దీంతో పూర్తిగా పక్కకు పోయింది. హోదా అన్నటువంటి వాటికి బదులుగా తర్వాత బీహార్లో ఇస్తామని గత ఎన్నికలలో తెలియజేశారు.. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఇది అడుగుతున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ కీలకమే ఎన్డీఏకు.. చంద్రబాబు కీలకమే.

ఈ రెండు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. అక్కడేమో అదే సందర్భంలో బీహార్లో సుదీర్ఘ కాలం పాటు నష్టపోయిన రాష్ట్రం.. ఈ రెండిటికి ప్రత్యేక హోదా ఇచ్చిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. లేదా హోదాలో భాగంగా ఇచ్చేటువంటి టాక్స్ రిమూవల్ అనేది ఉంటుందా.. పరిశ్రమలు పెట్టే వాటికి పన్ను రాయితీలు అనేవి క్రిందటి సారి చంద్రబాబు ఉన్నప్పుడే ఇచ్చారు. 30+10+10 మరి ఇలాంటివన్నీ ఒకేసారి ఇవ్వడమా లేకపోతే హోదా అని ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్లుగా తెలుస్తోంది.. మరి ఏం జరుగుతుందా అనే విషయం మరొక కొద్ది రోజులలో తెలియబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: