నార్త్ లో ప్రభాస్ పవర్ మాములుగా లేదుగా..?

Purushottham Vinay
 'బాహుబలి' సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి సంచలన విజయం సాధించిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కు నార్త్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి డార్లింగ్ నటించిన సినిమాలాన్ని కూడా హిందీ బెల్ట్ లో టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు అయితే రాబడుతున్నాయి. ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమాపై మొదటి నుంచీ నార్త్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. పైగా ప్రభాస్ తో పాటుగా ఈసారి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా మూవీలో యాడ్ అవ్వడం సినిమాకి మరింత ప్లస్ అయింది. ఇక అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ని బట్టి చూస్తే, కల్కి సినిమా 2024లో హిందీలో అతిపెద్ద ఓపెనర్‌గా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.'కల్కి 2898 AD' మూవీకి నార్త్ ఇండియాలో ఇప్పటికే 45 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం తెలుస్తోంది. అంటే అడ్వాన్స్ బుకింగ్స్‌ తోనే ఈ సినిమా ఏకంగా పాతిక కోట్లు వసూలు చెయ్యనుందని సమాచారం.


ఇక ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్లు రూ. 30 కోట్లకి పైగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిడ్ వీక్ రిలీజ్, టీ20 వరల్డ్ కప్ సెమీస్ లను పరిగణనలోకి తీసుకుని కనుక చూస్తే.. ప్రభాస్ సినిమాకి ఇది అధ్బుతమైన ఓపెనింగ్ అనే చెప్పాలి. ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వచ్చి, రివ్యూలు సానుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ లో కల్కి ప్రభంజనం సృష్టించడం ఖాయం.బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరోల సినిమాల ఓపెనింగ్స్ 15 కోట్లు దాటడం అనేది చాలా అంటే చాలా కష్టమైపోయింది. గతేడాది ఓన్లీ షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 'జవాన్' సినిమాలు మాత్రమే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. అలాగే రణబీర్ కపూర్ 'యానిమల్' కూడా 20 కోట్లకు పైగా రాబట్టింది.2024లో హృతిక్‌ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీ ₹22.5 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా బాలీవుడ్ లో నిలిచింది. 'కల్కి' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ నంబర్ ను క్రాస్ చేసి, బాలీవుడ్‌లో అతి పెద్ద ఓపెనర్ గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: