కూటమి పాలనపై.. కేకే సర్వే సంచలన విషయాలు..!

Divya
2024 ఎన్నికల సమయంలో కే కే సర్వే ఒక సంచలన సర్వేని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలుస్తుందని చెప్పిన వైసీపీ గోరంగా ఓడిపోతుందని చెప్పడంతో చాలామంది kk సర్వే అని ట్రోల్ చేయడం కూడా జరిగింది. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేకే సర్వే అంచనా 100 కి 100% నిజమయింది. ఆ సమయంలో కేకే సర్వే మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా కేకే సర్వే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల తర్వాత ఎలా ఉందని విషయం పైన అడగగా.. ఇలా తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్లో కూటమి వంద రోజుల పాలన పైన కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం పైన సోషల్ మీడియాలో ఉన్నంత హైప్ గ్రౌండ్ లెవెల్ లో లేదని వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం త్వరలోనే రిలీజ్ చేస్తానని.. అలాగే తెలంగాణకు సంబంధించిన విషయాల పైన కూడా పలు విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో  వచ్చిన తర్వాత ఎక్కువగా వైసీపీని విమర్శిస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నారని కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి తెలిపారు.

వైసీపీ పార్టీకి టిడిపి, జనసేన పార్టీనే ఎక్కువగా ప్రచార సాధనలుగా మారుతున్నాయి అంటూ ఆయన తెలియజేయడం జరిగింది.. దీన్నిబట్టి చూస్తే టిడిపి జనసేన పార్టీ పైన ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ని సీట్లు గెలుస్తుందని చెప్పిన కేకే సర్వే ఇప్పుడు 100 రోజు పాలన పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇకనైనా కూటమి నేతలు ఏపీ అభివృద్ధి పైన ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టేలా చూస్తారేమో చూడాలి మరి. మరి ఎలాంటి విషయాలు కే కే సర్వే తెలుపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: