గోదావ‌రి జిల్లాల‌కు హాట్ ప్రాప‌ర్టీ ఆ ఒక్క ఊరే సుమా.. ఏ ఊరో తెలుసా..!

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .
ఉభ‌య‌ గోదావరి జిల్లాలలో చాలా పెద్ద నగరాలు ఉన్నాయి. ఏలూరు - భీమవరం - కాకినాడ - రాజమహేంద్రవరం - అమలాపురం ఇలా చెప్పుకుంటూపోతే కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ వరకు ఈ రెండు జిల్లాలలో ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాలో అతిపెద్ద నగరంగా విస్తరించి అవకాశాలు భీమవరం కు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి - కాకినాడకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ భీమవరం విస్తరణకు మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే కొత్తగా భీమవరం మాస్టర్ ప్లాన్ రెడీ చేసి భారీగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో భీమవరంలో నూతన కాలనీలు ఏర్పడ్డాయి .. రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేశారు. అవి పట్టణంలో విలీనం అయ్యాయి. పట్టణం అభివృద్ధి చెందిన అందుకు అనుగుణంగా పట్టణ రూపు అయితే మారలేదు.

శివారు ప్రాంతాలకు రోడ్లు అనుసంధానం కాలేదు. ఇప్పుడు సమగ్ర ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు .. ఔటర్ రింగ్ రోడ్డు ... కనెక్టివిటీ రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు పెడుతున్నారు. నగరం మొత్తం 45 అడుగుల రోడ్లు... అలాగే నరసాపురం - భీమవరం రోడ్డు 40 నుంచి 60 అడుగులు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన భీమవరం వాసులు తమ సొంత ఊరిలో ఇల్లు ఉండటం ఎంతో ముఖ్యం అనుకుంటున్నారు. ఇప్పటికి ఇల్లు ఉన్న మరింత విశాలంగా కట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున స్థలాలు కొనేవారు పెరుగుతున్నారు .. లే అవుట్లు కూడా పెరుగుతున్నాయి. గోదావరి జిల్లాలలో భీమవరం వచ్చే పదేళ్ల‌ కాలంలో హాట్‌ ప్రాపర్టీగా మారుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: