పుష్ప 2 డిసెంబర్ 5న వస్తుందా.. రాదా... ఎందుకు ఈ టెన్షన్.. !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప. ఇప్పుడు ఈ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ముఖ్యంగా నార్త్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం మూడేళ్లుగా కోట్లాది మంది సినీ ప్రేమికులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ నెలకొనగా తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే ఆ హైప్ ఇంకో లెవల్ కి తీసుకు వెళ్లింది. అయినా కూడా ఈ సినిమా విషయంలో ఓ టాక్ మళ్ళీ బయటికి వచ్చింది. గతంలో పుష్ప 1 రిలీజ్ డేట్ లో కూడా కంటెంట్ డెలివరీ పరంగా చాలా టెన్షన్ వాతావరణం కనిపించింది.
చివరి నిమిషంలో పలు చోట్ల షోలు నిలిచిపోయాయి. అయితే ఈసారి పార్ట్-2 కు చాలా ఎక్కువ సమయం తీసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నారు .. కానీ చివరి నిమిషంలో డిలే తప్పదు అని తెలుస్తోంది. పరిస్థితులు చూస్తుంటే పుష్ప టీం బాగా టెన్షన్ లో కనిపిస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఓ పక్క ఇంకా బ్యాలెన్స్ షూటింగ్ ఉంది. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆదరాబాదరగా జరుగుతున్నట్టు సినీ వర్గాలో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ అయితే మళ్లీ అప్పట్టాగానే రాత్రి పగలు కంటెంట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మొన్న ట్రైలర్ రిలీజ్ విషయంలోనూ ఆయన కనిపించలేదు. ఏది ఏమైనా మళ్లీ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ విషయంలో టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉంది. ముందు అనుకున్నట్టు డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.