నాగచైతన్య పెళ్లికి .. దగ్గుబాటి కుటుంబం నుంచి ఊహించని గిఫ్ట్ .. బయటపడ్డ అసలు మేటర్..!

Amruth kumar
అక్కినేని హీరో నాగచైతన్య , సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత రహస్యంగా మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లను ప్రేమించే రహస్యంగా ఎంగేజ్మెంట్ చూసుకున్నారు. ఇప్పుడు ఈ సెలబ్రిటీల పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దగ్గుబాటి ఫ్యామిలీ.. తమ మేనల్లుడు కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నట్లు ఓ వార్తా వైరల్ అవుతూంది. హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆగస్టులో ఎంతో రహస్యంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. సమంతకు విడాకులు ఇచ్చి సంవత్సరం కాకముందే మరో ఒక  అమ్మాయి తో చైత‌న్య తిరుగుతున్నారంటూ పుకార్లు అప్పట్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక‌ నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తో సిని ప్రేక్షకులు అభిమానులు ఒకసారిగా షాక్క్ అయ్యారు.

మామూలుగా ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఏదైనా చిన్న ఈవెంట్ అయినా సరే వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది నాగచైతన్య లాంటి స్టార్ హీరో ఎంగేజ్మెంట్ .. తండ్రి నాగార్జున సోష‌ల్ మీడియ‌లో ఫోటోలు పెట్టే వరకు కూడా ఎవరికీ క్లారిటీ రాలేదు. ఎంతో సీక్రెట్ గా నిశ్చితార్థ్యం జరిపారు అర్థం చేసుకోవచ్చు. వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. తాజాగా వీరి పెళ్లి కార్డు పంచడం కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరి పెళ్లి కూడా డిసెంబర్ 4న జరగబోతుంది. పెళ్లి వేడుక ఎక్కడనే మాత్రం కార్డులో మెన్షన్ చేయలేదు.

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి జరగబోతుందని ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారని అంటున్నారు. అయితే ఇప్పుడు తమ మేనల్లుడు పెళ్లికి దగ్గుబాటి కుటుంబం భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఆ గిఫ్ట్ ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. మేనల్లుడు కోసం ఏదో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారని టాలీవుడ్ లో టాక్. ఈ గిఫ్ట్ తన చిన్న మామ వెంకటేష్ ఇస్తున్నారట. అది ఏంటనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని దగ్గుబాటి అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: