టీవీ: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది వారే..?

Divya
బిగ్బాస్-8 వ సీజన్ కు సంబంధించి నాలుగవ వారం ఎలిమినేషన్ ఎవరు ఉంటారనే విషయం పైన ఆడియన్స్ చాలా సస్పెన్స్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని కేవలం  సీక్రెట్ రూమ్ కు కంటెస్టెంట్ ని పంపిస్తారనే విధంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్ లో ఆరుగురు కనిపిస్టెంట్లు ఉన్నారు ఇందులో ఆదిత్య ఓం, పృద్వి, ప్రేరణ, మణికంఠ, సోనియా ఉన్నారు అయితే ఈ వారం హౌస్ నుంచి బయటికి వచ్చిన వారిని సీక్రెట్ రూమ్ లో ఉంచేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా వచ్చిన బిగ్ బాస్ లీగ్ ప్రకారం ఒక కంటెస్టెంట్ ని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అందులో సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం ఎపిసోడ్లో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో వచ్చేటువంటి బిగ్బాస్ లీకు ద్వారా ఈ విషయం వైరల్ గా మారుతున్నది. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా సోనియా ఎలిమినేషన్ కచ్చితంగా కన్ఫర్మ్ అయినట్లుగా ఆడియన్స్ తెలుపుతున్నారు. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి నిఖిల్, పృథ్వి, సోనియాతో ఎక్కువగా కలిసే ఉంటున్నారు.

నిఖిల్, పృధ్వి లను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఆమె చుట్టూ తిప్పుకునేలా చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా టాస్కుల సమయంలో కూడా ఈమె పర్ఫామెన్స్ పెద్దగా లేదని ఇదే మైనస్ గా మారిందని అలాగే ఈమెను టార్గెట్ చేస్తే నిఖిల్ పృథ్వీలు కూడా ఈమె కంటే ముందుగానే మాట్లాడుతున్నారట.. ఇది చాలా వ్యతిరేకత ఏర్పడింది.బిగ్ బాస్ -8 లో సోనియాకు ఇదే చివరి వారమని కూడా చెప్పవచ్చు. అయితే ఆర్జీవి కూడా ఈమెకు సపోర్టుగా ఉండాలని ట్వీట్ చేసినప్పటికీ అది పెద్దగా కలిసి రాలేనట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి ఎలిమినేట్ ఎవరన్నది రేపటి ఎపిసోడ్లో క్లియర్గా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: