లియోకి చేసిన తప్పుని గోట్ కి చెయ్యకుండా జాగ్రత్త పడుతున్న మేకర్స్?

Purushottham Vinay
 దళపతి విజయ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి ఖచ్చితంగా పూనకాలు వచ్చేస్తాయి. భారీ అంచనాలతో హైప్ పెంచేస్తారు. లియో సినిమాకి అయితే హైప్ పీక్ స్టేజిలో పోయింది. 1000 కోట్లు ఈజీగా రాబడుతుందని అనుకున్న ఈ సినిమా కేవలం 400 కోట్ల లోపే ఎండ్ అయిపోయింది. ప్రస్తుతం దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గోట్ (జి.ఓ.ఏ.టి.) ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో త్రిష కూడా ఇంపార్టెంట్ రోల్ లో ఛాన్స్ దక్కించుకుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ మూవీ విషయంలో మేకర్స్ అంతా కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, రెండు సాంగ్స్ ని వదిలారు. కానీ వాటి వల్ల అస్సలు బజ్ రాలేదు. అయితే దళపతి గోట్ సినిమా మరోసారి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కు మంచి మాస్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.


ఇక పోతే సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేసి ఆ తర్వాత లియో లాగా అంచనాలను అందుకోలేదని అనుకోవడం కన్నా సినిమా గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా థియేటర్ లో ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే దళపతి విజయ్ గోట్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరగట్లేదని అంటున్నారు. ఇక ఒక సినిమా పూర్తి చేసే దాకా మరో సినిమా గురించి ఆలోచించని విజయ్, గోట్ రిలీజ్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటన్నది చెప్పాలని చూస్తున్నారు.


ఇక గోట్ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే తెలుగులో ఈసారైనా విజయ్ వచ్చి ప్రమోషన్స్ చేస్తాడా లేదా అని తెలుగు ఆడియన్స్ బాగా డౌట్ పడుతున్నారు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే యువన్ శంకర్ రాజా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించారు. విజయ్ గోట్ సినిమాకు మ్యూజిక్ పరంగా కూడా యువన్ తన మార్క్ మ్యూజిక్ తో అయితే ఆకట్టుకోలేదని విడుదల అయిన రెండు పాటలు నిరూపించాయి. కానీ BGM మాత్రం బాగా అందించారని తెలుస్తుంది. మరి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గా విజయ్ తన సత్తా చాటుతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: