కాంగ్రెస్: అలకతో పదవి అలంకరణ.. జీవన్ రెడ్డి మామూలోడు కాదు.!

Pandrala Sravanthi
కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద సముద్రం లాంటిది. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఈ పార్టీకి ఎంతో మంది అభిమానులు ఉంటారు.  అలాంటి ఈ పార్టీలో స్వతంత్రత ఎక్కువగా ఉంటుంది. నాయకులు వారికి నచ్చిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అలాంటి పార్టీలో ఎంతోమంది సీనియర్లు  ఉన్నారు.  అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పార్టీలో ఉండేటువంటి సీనియర్లు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి పాలన కొనసాగిస్తున్నారు. ఎంత చేసినా  కొంతమంది సీనియర్లు మాత్రం అలక బునుతూనే ఉన్నారు. తాజాగా జీవన్ రెడ్డి అలకబునారు. పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వడం లేదని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పని చేసిన నాకు ఎవరు వ్యాల్యూ ఇవ్వలేదని అలిగారు. 

అంతేకాదు పార్టీని కూడా విడిచి పెడతానని చెప్పుకుంటూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం. ఆయన చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందిన సంజయ్ చేరికను తనతో చర్చించకుండానే పార్టీలో చేర్చుకోవడం తనకు నచ్చలేదని అన్నారు. చివరికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని బాహాటంగానే ప్రకటించారు.  ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి ఈ విధంగా కామెంట్లు చేయడంతో విపరీతంగా చర్చ సాగుతోంది.  

ఈ విషయం ఢిల్లీ పెద్దలకు తెలియడంతో వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను పంపించి బుజ్జగించమని చెప్పారు. అంతేకాకుండా జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాలని కబురు కూడా పంపారు.  ఢిల్లీ తీసుకొచ్చే బాధ్యత అడ్లూరి లక్ష్మణ్ అప్పగించారు. ఇదే తరుణంలో జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం భారీ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ ఉంది.  ఇందులో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారని చర్చ జరుగుతోంది. సీనియర్ నేత ఆయన జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా, లేదంటే ఇంకేదైనా పదవి కట్టబెడతారా అనేది రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చ సాగుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: