కల్కి: 600 కోట్ల బడ్జెట్ పెట్టి అంత పెద్ద తప్పు చేస్తున్నారా? ఇలా అయితే హిట్టు కష్టమే?

Purushottham Vinay
కల్కి: 600 కోట్ల బడ్జెట్ పెట్టి అంత పెద్ద తప్పు చేస్తున్నారా? ఇలా అయితే హిట్టు కష్టమే?  పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ గా ఉంది.హాలీవుడ్‌ సినిమాని తలపించే రేంజ్ లో ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్ రూపొందించాడు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ బాక్సాఫీస్ వద్దే కాకుండా విదేశాల్లో కూడా వసూళ్ల రికార్డ్‌ లు నమోదు అవ్వడం ఖాయం అనే నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ పట్టణాలు ఇంకా నగరాల్లో కల్కి సినిమాను భారీ ఎత్తున స్క్రీనింగ్‌ చేసేందుకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో దీపికా పదుకునే ఇంకా అలాగే దిశా పటానీ లు హీరోయిన్స్ గా నటించారు.సీనియర్ హీరోలు అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటించారు. 


అలాగే నాని, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోలు గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ అందులో క్లారిటీ లేదు. ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అయితే 600 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న మేకర్స్ ఓ పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ తప్పు చేస్తే ఈ సినిమా అస్సలు ప్రేక్షకులకు త్రిల్ ఫీలింగ్ ఇవ్వదు. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. ఈ సినిమాని తక్కువ బ్రయిట్నెస్ తో రిలీజ్ చేస్తున్నారు. అలా చెయ్యడం వల్ల సినిమాలోని విజువల్స్ క్లారిటీగా కనపడవు.సినిమా అంతా డార్క్ గా ఉంటుంది. అందువల్ల ఆడియన్స్ కి కొత్త అనుభూతి రాదు.అంతేగాక ఈ సినిమాని కేవలం 2K వెర్షన్లోనే రిలీజ్ చేస్తున్నారట. ఈరోజుల్లో రీ రిలీజ్ చేస్తున్న పాత సినిమాలను సైతం 4K కి డిజిటలైజ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.4K కి అప్డేట్ చేయడం వల్ల క్వాలిటీ అనేది బాగుంటుంది. కానీ ఓ రేంజ్లో విజువల్స్ ఎఫెక్ట్స్ కలిగిన ఈ ‘కల్కి 2898 ad ‘ ని 2K వెర్షన్లో రిలీజ్ చేస్తే 1000 కోట్లు కాదు కదా 500 కోట్లు రావడం కూడా చాలా కష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: