ఆ ఓటమి పవన్ తో ఇలా చేయిస్తుందా... అయినా వైసీపీని ఎదుర్కోగలడా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ సొంతగా జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన 2014 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీలో లేదు. మేము పూర్తిగా ఎన్నికలకు సిద్ధంగా లేము. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి వస్తాము అని పవన్ చెప్పాడు. ఇక 2019.వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫు నుండి అనేక మంది అభ్యర్థులు నిలబడ్డారు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుండి పోటీలోకి దిగారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో కావడం, జనసేన పార్టీ అధ్యక్షుడు కావడంతో ఈయన రెండు స్థానాల్లో పోటీ చేస్తూ ఉండడంతో రెండింటిలో ఒక దానిలో నైనా కచ్చితంగా గెలుస్తాడు అని జనాలు భావించారు. కానీ రిజల్ట్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాలలో ఓడిపోగా జనసేన పోటీలోకి దిగిన అన్ని ప్రాంతాలలో కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో గెలుపొందింది.

దీనితో పవన్ ఆలోచనలో పడ్డాడు. ఇక ఈ ఐదు సంవత్సరాలలో అనేక ప్రణాళికలను వేసుకున్న పవన్ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తో పాటు పోటీలోకి దిగబోతున్నాడు. ఇక పోయినసారి గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోవడంతో ఈ సారి పవన్ పిఠాపురం నుండి పోటీలోకి దిగాడు. ఇక పోయినసారి లాగా కాకుండా ఈ సారి కేవలం పవన్ ఒకే నియోజకవర్గం పై దృష్టి పెట్టాడు. పోయినసారి తన స్టామినా తోనే పవన్ గెలుస్తాను అని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఇక దానితో ఈ సారి పిఠాపురం పైకి తన సైన్యం మొత్తాన్ని దించాడు.

చాలా రోజుల క్రితం నుండే పవన్ కి సపోర్ట్ గా ఎంతో మంది జబర్దస్త్ నటులు పిఠాపురంలో ప్రచారాలను చేస్తున్నారు. ఆ తర్వాత నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి వారు కూడా పవన్ కి సపోర్టుగా నిలిచారు... ప్రచారాలను కూడా చేశారు. ఇక నిన్న ప్రచారాలకు చివరి రోజు కావడంతో రామ్ చరణ్ కూడా పిఠాపురం కి వచ్చాడు. ఇలా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం పై తన ఫుల్ స్ట్రెంత్ ను వాడుతున్నట్లు తెలుస్తోంది. మరి పోయిన సారి వచ్చిన రిజల్ట్ కారణం గానే పవన్ ఈ స్థాయిలో పిఠాపురం పై స్టార్ క్యాంపెయిన్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంత మందిని రంగంలోకి దించిన కూడా వైసీపీ పార్టీ క్రేజ్ ముందు పవన్ నిలబడడం కష్టమే అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: