హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి మనలలో
కరీనా కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ
హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమె
హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లోనే మంచి విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్
హీరోయిన్స్ స్టేటస్ కి చేరుకుంది. ఇక స్టార్
హీరోయిన్ అయిన తర్వాత టాప్ హీరోల పక్కన నటించి చాలా సంవత్సరాల పాటు ఈ
బ్యూటీ టాప్
హీరోయిన్ గానే కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఈమె
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి
సైఫ్ అలీ ఖాన్ ను
పెళ్లి చేసుకుంది.
ఇక
పెళ్లి తర్వాత వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతోంది. ఇకపోతే
కరీనా కపూర్ కు
కరిష్మా కపూర్ అనే సోదరి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా చాలా బలంగా ఉంటుందట. దానితో
కరీనా కపూర్ ,
కరిష్మా కపూర్ ఇద్దరు కూడా రోజుకు గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారట. ఇక వీరు ఫోన్లు మాట్లాడే సమయంలో ఎక్కువ శాతం గాసిప్స్ ఉంటాయట. ఇక వీరు రోజులో ఎక్కువ శాతం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో
కరీనా కపూర్ భర్త
సైఫ్ అలీ ఖాన్ కూడా దీనిని తట్టుకోలేక పోయాడట.
ఒకానొక సందర్భం లో ఆయన నువ్వు
పెళ్లి చేసుకుంది నన్నా ... లేక మీ అక్కనా. రోజు ఎందుకు అన్ని గంటలు ఫోన్లో మాట్లాడుతుంటావు అని సరదాగా అన్నాడట. ఇకపోతే
కరీనా కపూర్ ఇప్పటికి కూడా సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగానే కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే
సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.