నానితో సాయి పల్లవికి ఉన్న గొడవేంటి.. షూటింగ్లో అసభ్యంగా.?

Pandrala Sravanthi
హీరోలలో న్యాచురల్ స్టార్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నాని మాత్రమే..అలాగే హీరోయిన్లలో నేచురల్ స్టార్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సాయి పల్లవి మాత్రమే.. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎంసీఏ సినిమా కూడా మిడిల్ క్లాస్ జనాలనీ ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చూసిన వాళ్లు చాలామంది సినిమా కథకి కనెక్ట్ అయిపోయారు. అయితే అలాంటి ఎంసీఏ సినిమా చేసే సమయంలో నానికి సాయి పల్లవికి మధ్య ఏం జరిగింది.. షూటింగ్లోనే వీరిద్దరూ గొడవ పడడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నాని,సాయి పల్లవి కాంబినేషన్లో ఎంసీఏ సినిమా మాత్రమే కాదు శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో హీరోయిన్ గా  సాయి పల్లవి కనిపిస్తుంది.ఇక ఈ పాత్రకి సాయి పల్లవికి అవార్డు కూడా రావాలని ఎంతోమంది అభినందించారు. 

అయితే అలాంటి సాయి పల్లవి నాని ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. కానీ ఇద్దరి మధ్య ఓ సమయంలో గొడవ జరిగిందట. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాని,సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఎంసీఏ సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవి నానికి మధ్య ఏదో విషయంలో కన్వర్జేషన్ జరుగుతూ సడన్ గా ఇద్దరూ గొడవ పెట్టుకున్నారట. అయితే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో అధి కాస్త పెద్ద గొడవకు దారి తీసి షూటింగ్ నుండి సాయి పల్లవి ఇంటికి వెళ్లిపోయిందట.ఇక డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పినా కూడా సాయి పల్లవి వినిపించుకోలేదట.

ఆ తర్వాత వీరిద్దరి గొడవలోకి నిర్మాత దిల్ రాజు ఎంట్రీ ఇచ్చి ఇద్దరి మధ్య ఉన్న గొడవలు క్లియర్ చేసి మళ్ళీ షూటింగ్ కి సాయి పల్లవి వచ్చేలా మంతనాలు చేశారట.అలా ఇద్దరి మధ్య దిల్ రాజు సందీ కుదిర్చడంతో ఆ గొడవ అక్కడితో మర్చిపోయారు. అయితే వీరిద్దరూ అంతలా గొడవ పెట్టుకోవడానికి కారణం ఏంటి అనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నానితో సాయి పల్లవి జతకట్టింది. ఇక రీసెంట్ గా సాయి పల్లవి, శివ కార్తికేయన్ తో నటించిన అమరన్ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే m

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: