నా భర్తను పెళ్లి చేసుకుంటానన్న స్టార్ హీరోయిన్.. నటుడు భార్య ఏం చేసిందంటే..?

Divya
బాలీవుడ్ లో సీనియర్ జంట గా పేరు పొందిన జంటలలో గోవింద-సునీత ఆహుజా జంట కూడా ఒకరు. వీరికి వివాహమై నాలుగు దశాబ్దాలు అవుతూ ఉన్న 40 ఏళ్ల కాలంలో ఎన్నో ఇబ్బందులను చూసామని తెలుపుతున్నారు. ఇవన్నీ కూడా అధిగమించుకొని మరి ఇప్పటికే వీరు తమ వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఈ విషయాలు విన్న తర్వాత అభిమానులు కూడా ఈ జంటను ప్రశంసిస్తున్నారు.

హీరోయిన్ రవీనా టాండన్ ఇప్పటికీ కూడా ఒక మాట అంటూ ఉంటుందని గోవిందాని నాకంటే ముందే కలిసి ఉంటే కచ్చితంగా తనని పెళ్లి చేసుకునేదాన్ని చెబుతూ ఉంటుందని తెలిపింది సునీత.. అలా అన్నప్పుడు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు తనను నువ్వు తీసుకువెళ్ళు నీకే అర్థమవుతుందని సరదాగా చెప్పేదాన్ని అంటూ తెలియజేసింది సునీత. గోవింద రవినా కాంబినేషన్లో దూల్జే రాజా, బడే మియా చోటే మియా, ఆంటీ నెం.1 ఇవే కాకుండా సుమారుగా 12 సినిమాలు పైగా వీరిద్దరి కాంబినేషన్లో విడుదలయ్యాయట. ఇలాంటి సమయంలోనే గోవింద గురించి రవినా టాండన్ కు ఆయన వ్యక్తిత్వం నచ్చేదట.

ఇటీవలే అనుకోకుండా బుల్లెట్ తగిలి గోవింద గాయపడినప్పటికీ అప్పుడు కూడా రవీనా  ఆసుపత్రికి వెళ్లి మరి అతడిని పరామర్శించినట్లు తెలియజేసింది సునీత.. ప్రస్తుతం పింకు డార్లింగ్, లండన్ తదితర చిత్రాలలో నటించడమే కాకుండా పలు రకాల బిజినెస్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారని తెలియజేసింది సునీత. అలాగే తమ జీవితంలో సైతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఏ రోజు చిన్న చిన్న గొడవలు జరిగిన కూడా ఆ రోజే మర్చిపోయి మరి మాట్లాడుకునే వారమని ప్రతి విషయం పైన ఇద్దరి అంగీకారం ఉంటుంది అని తెలిపింది సునీత.. ఇలా అన్ని విషయాలను కూడా ఇద్దరము అంగీకరించుకొని ముందుకు అడుగులు వేసే వారమని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: