ఆంధ్రప్రదేశ్లో మద్యం, మాంసం తాగని ఊరు ఏదో తెలుసా..?

Divya
చాల గ్రామాలలో కోడికూయాగానే నిద్ర లేవడం వంటివి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పండుగలు శుభకార్యాలు జరిగితే కొన్ని గ్రామాలలో కచ్చితంగా చికెన్ లేదా మటన్ వంటివి తినడం ఆడవాయితీగా ఉంటుంది. మరి కొంతమంది మద్యం కూడా సేవిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామంలో మాత్రం మద్యం, మాంసం అంటే అసలు ఆ గ్రామంలోకే రానివ్వరట. మరి ఆ గ్రామం ఏది ఒకవేళ తినవలసి వస్తే ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఆ గ్రామం ఏదో కాదు.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో గుమ్మగట్టు మండలంలో ఆడిగుప్ప గ్రామంలో ఇప్పటికీ కూడా మద్యం,గుడ్డు, చికెన్ వంటివి అసలు ముట్టరట. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇచ్చే కోడి గుడ్డును ఆ గ్రామంలో చదువుకొనే విద్యార్థులు ఎవరూ కూడా ముట్టారని సమాచారం. ఈ ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామంలో వస్తూనే ఉందట. మద్యం, కోడి మాంసం వంటివి అసలు తినకూడదనే కట్టుబాటులు ఆ గ్రామ ప్రజలు అసలు తప్పరట. ఈ పద్ధతి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్నదట.

అయితే ఇందుకు గల కారణం ఏమిటంటే ఒకానొక సమయంలో రాజులు పాలించే సమయంలో బుడిగ చిన్నయ్య ఆడిగుప్ప కోట పైన దండయాత్ర చేసి కొంతమంది దొంగలు గ్రామ ప్రజలకు సైనికులకు మత్తుమందు ఇచ్చి మద్యం సేవించి మాంసం తినిపించి నిద్రలోకి జారుకునేలా చేశారట. ఆ సమయంలోనే ఆడిగుప్ప కోటను పరిపాలిస్తున్న రాజు కలలోకి దేవుడు వచ్చి ఎదురయ్యే సంఘటనను చెప్పారట.. దీంతో రాజు శత్రు సైనికులను తన సైన్యంతో వచ్చేవరకు కదలకుండా చూసుకోవాలని దేవుడిని వేడుకున్నాడట అప్పటి పాలించే రాజు.. అలా చేస్తే కచ్చితంగా మీరు అడిగినది నేను నెరవేరుస్తానంటూ రాజు కలలోనే వాగ్దానం చేశారట.

అక్కడికి రాజు వచ్చేవరకు శత్రు సైనికులు అలాగే ఉన్నారట. దీంతో రాజు శత్రు సైనికులను చంపడమే కాకుండా దేవుడు కోసం ఆడి గొప్ప కోటరాజు ఏకంగా 150 ఎకరాలు భూమిని కూడా దత్తకు ఇచ్చి గుడిని నిర్మించారట.. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామంలో ఎవరూ కూడా మద్యం సేవించకూడదని కోడి మాంసం తినకూడదని ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారట ఆ ఊరు ప్రజలు. అయితే ఎవరైనా తినాలి అనుకుంటే మాత్రం ఇతర ఊర్లకు వెళ్లి తినాల్సిందే తప్ప అది కూడా పొలిమేర దాటి గ్రామంలోకి వచ్చే ముందు ఎలాంటి ముక్కలను మందును తీసుకొని రాకూడదట. అందుకే ఆ గ్రామంలో కోడి కూడా కూయదట. అయితే ఈ విషయం తెలిసిన వారందరూ కూడా ఆ ఊరు ప్రజలను మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: