ఆమ్లెట్ vs ఉడికించిన గుడ్డు.. ఏది మంచిది..?

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఉరుకులు పరుగుల జీవితంతో సరైన సమయానికి భోజనం చేయక పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన శైలి కోసమే ఈ మధ్యకాలంలో చాలా మంది పలు విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది ఫిట్నెస్ కోసం జిమ్ వర్కౌంట్స్ వంటివి చేస్తూ ఉండగా, మరికొంతమంది ఉదయం లేవగానే వాకింగ్ వంటివి చేస్తున్నారు. శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కోసం గుడ్లను వారి ఆహారంలో చేర్చుకుంటున్నారు.



గుడ్డు తినడానికి మంచిదే కానీ చాలామంది ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ తినడంలో ఏది ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే విషయం ఇప్పటికి సందేహంగానే ఉంటుంది? అయితే బరువు తగ్గడానికి! బరువు పెరగడానికి గుడ్లను ఎలా తినాలి ? అనే వివరాలను కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఎవరైనా బరువు తగ్గాలనుకున్నట్లు అయితే వారు ఉడికించిన గుడ్లను తినడం మంచిది. ఇలా ఉడికించిన గుడ్లలో నూనె లేదా కొవ్వు ఉండదు. కాబట్టి కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఆకలి బాధ వేయదు. ఇది శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగించేస్తుంది అందువల్ల ఉడికించిన గుడ్డుని తినడం చాలా ముఖ్యం.


అలాగే బరువు పెరగాలనుకునేవారు ఆమ్లెట్ ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నూనె, వెన్న, జున్నుతో తయారు చేసిన వాటిని మనం తినవచ్చు. దీని ద్వారా క్యాలరీ కంటెంట్ పెరిగి బరువు పెరుగుతారు. వ్యాయామం చేసేవారు ఆమ్లెట్లు తినడం వల్ల ఎక్కువ శక్తి లభిస్తుంది. అలాగే కండరాలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.అయితే ఆమ్లెట్లను ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు కూడా కొన్నిసార్లు పెరుగుతారు.


ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్ రెండు కూడా ఆరోగ్యానికి చాలానే మేలు చేస్తాయి. కానీ సరైన పద్ధతిలో సరైన పరిమాణంలో వీటిని తినడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: