ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,645 అంగన్వాడి పోస్టుల భర్తీ..!

Divya
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇప్పటికే ఉగాది కానుక సందర్భంగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేశారు. ఇలా ప్రతి ఏడాది కూడా ఉంటుందని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ మహిళలకు సైతం తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక కీలకమైన ప్రకటన ద్వారా తెలియజేశారు. సోమవారం రోజున పార్వతీపురంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియజేసింది.




రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5000 మినీ అంగన్వాడికి కేంద్రాలను ప్రభుత్వం ప్రధాన అంగన్వాడి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తోందని ఈ మార్పు వల్ల ఆయా కేంద్రాలలో ఇప్పుడు అదనపు సిబ్బంది కూడా కావాల్సి ఉంటుంది. ఈ కేంద్రాలలో కొత్తగా అంగన్వాడి సహాయకులను నియమించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. మొదటి విడతలో భాగంగా 2,645  కేంద్రాలలో సహాయకులు నియామక ప్రక్రియ ప్రారంభించబడుతుందని తెలియజేశారు మంత్రి సంధ్యారాణి. మిగిలిన కేంద్రాలలో తదుపరి దశలవారీగా భర్తీ చేస్తామని తెలియజేశారు.



ఈ నిమకాలకు సంబంధించి ఆయా జిల్లాలలో కలెక్టర్ నేతృత్వంలోనే  జరుగుతాయని,నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని, స్థానిక ప్రకటనల ఆధారంగానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందట. పారదర్శకంగానే జరుగుతుందంటూ తెలియజేశారు. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ పోస్టులను సైతం భర్తీ చేయడానికి అనుమతి లభించడంతో  అభ్యర్థుల సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలు ఈ నిర్ణయం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. మరి త్వరలోనే దీనిపైన పూర్తిస్థాయి షెడ్యూల్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు ఏపీ అంతట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: