బెస్ట్ ఫ్రెండ్ సర్‌ప్రైజ్‌తో సామ్ బర్త్‌డే మరింత స్పెషల్!

Amruth kumar
సమంత అంటే కేవలం ఒక హీరోయిన్ కాదు, అంతులేని పట్టుదలకు ఒక నిలువుటద్దం. ఎన్నో సవాళ్లను, అనారోగ్య సమస్యలను ఎదిరించి నిలబడిన ఈ ‘ఐరన్ లేడీ’ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నెట్టింట సామ్ పేరు మార్మోగిపోతోంది.సమంతకు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనకు మధ్య ఉన్న అనుబంధం గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్ కెరీర్ మొదలైనప్పటి నుండి నీరజ ఆమెకు వెన్నంటి ఉన్నారు.

సామ్ పుట్టినరోజు సందర్భంగా నీరజ తన ఇన్‌స్టాలో కొన్ని అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్ డే పాప” అని ప్రేమగా విష్ చేశారు. వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలు, షూటింగ్ సెట్స్ లోని అన్‌సీన్ పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నీరజ కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు, సామ్ పర్సనల్ స్టైలిస్ట్ గా ఆమెకు ఎన్నో ఐకానిక్ లుక్స్ ఇచ్చారు.సమంత ఇప్పుడు తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా గురించి సామ్ ఫ్యాన్స్ లో మామూలు క్రేజ్ లేదు.

నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 1980ల నాటి పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఇందులో సామ్ ఒక పవర్‌ఫుల్ అండ్ రా (Raw) పాత్రలో కనిపించబోతున్నారు. సమంత అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ, ఈ సినిమా వచ్చే నెల మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ నుండి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ అగ్ర తారలందరూ సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఆమె వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం సామ్ చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ‘మా ఇంటి బంగారం’తో సామ్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: