రాజమౌళి మూవీ తర్వాత మహేష్ షాకింగ్ డిసిషన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
వారణాసి తర్వాత మహేష్ బాబు ఖాళీగా ఉండకుండా, వరుసగా మూడు సినిమాలను ఓకే చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ‘మైత్రీ మూవీ మేకర్స్’.మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ జర్నీ స్టార్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు మహేష్ కోసం ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేసిందట. రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యానర్లో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉందని స్ట్రాంగ్ గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద మళ్ళీ రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ!
కేవలం మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే కాకుండా, మహేష్ లైనప్‌లో మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారణాసి వంటి భారీ సినిమా తర్వాత అభిమానులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో, దానికి తగ్గట్టుగానే ఈ కొత్త ప్రాజెక్టులు ఉండబోతున్నాయట. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మూడు ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వడం అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పాలి.
రాజమౌళి సినిమాతో వచ్చే గ్లోబల్ ఇమేజ్ను కాపాడుకుంటూనే, తన మాస్ ఫ్యాన్ బేస్‌ను అలరించేలా మహేష్ బాబు తన భవిష్యత్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ‘వారణాసి’తో మొదలయ్యే ఈ గ్లోబల్ జర్నీ మున్ముందు ఏ స్థాయికి వెళ్తుందో అని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.