దురంధర్ 2లో క్యామియో పాత్రలో హీరోయిన్.. ఎవరంటే..?
టీజర్ విడుదలైన అన్ని భాషలలో కూడా భారీ హైప్ పెంచేసింది. తాజాగా బాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం దురంధర్ 2 పై ఒక విషయం వినిపిస్తోంది. అదేమిటంటే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. దురంధర్ 2 చిత్రంలో హీరోయిన్ యామీ గౌతమ్ ఒక కీలకమైన యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఈ చిత్రానికి సంబంధించి కథలు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని బాలీవుడ్ వర్గాలలో సమాచారం.
దురంధర్ 2 తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ యామీ గౌతమ్ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మంచి పాత్ర కావడం చేత తన భార్యని ఏకంగా రంగంలోకి దింపారు డైరెక్టర్. డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ కాంబినేషన్లో వచ్చిన ఉరి: ది సర్జరీకల్ స్ట్రైక్, ఆర్టికల్ 371 చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాలన్నీ దేశభక్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చి మంచి విజయాలను అందుకున్న ఇప్పుడు మరొకసారి వీరి కాంబినేషన్లోని దురంధర్ 2 రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. దురంధర్ 2 లో యామీ గౌతమ్ నటిస్తోందనే విషయం వైరల్ గా మారింది.