మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన రాత్రి నుండే ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండే అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలా రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను , అద్భుతమైన లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన మూడవ వారం బాక్స్ ఆఫీస్ రన్ కూడా తాజాగా కంప్లీట్ అయింది. విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో కూడా మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మంచి స్థానంలో నిలిచింది. విడుదల అయిన మూడవవారం అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ నే దాటేసింది. అసలు విషయం లోకి వెళితే ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.45 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇక మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి విడుదల అయిన మూడవ వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 46 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దానితో మన శంకర వర ప్రసాద్ గారు సినిమా రంగస్థలం మూవీ ని దాటేసింది.