టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భీమ్స్ సిసిరిలీయో ఈ మూవీ కి సంగీతం అందించగా ... షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్ల పై సాహు గారపాటి , సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 23 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 23 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎన్ని అనే వివరాలను తెలుసుకుందాం.
23 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 46.14 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 22.77 కోట్లు , ఉత్తరాంధ్ర లో 22.38 కోట్లు , ఈస్ట్ లో 15.63 కోట్లు , వెస్ట్ లో 9.96 కోట్లు , గుంటూరు లో 11.21 కోట్లు , కృష్ణ లో 10.91 కోట్లు , నెల్లూరులో 6.94 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 23 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 145.81 కోట్ల షేర్ ... 223.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 23 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 13.48 కోట్లు , ఓవర్సీస్ లో 19.37 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 23 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 178.66 కోట్ల షేర్ ... 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరి లోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని ఇప్పటికే 56.66 కోట్ల లాభాలను అందుకుంది.