YSR: పాదయాత్ర@23 ఏళ్లు.. జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

Divya
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ఎన్నో పనులు ఇప్పటికీ చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇప్పటికి 23 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన పాదయాత్ర అంటూ వైయస్ జగన్ పేర్కొన్నారు.



ఒక నాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను ప్రజల జీవితాలను ఎలా మార్చిందో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిరూపించారని, 2003 ఏప్రిల్ 9వ తేదీన ఎండల్లో ప్రజల కష్టాలను తెలుసుకొనేందుకు ప్రారంభించిన ఆ పాదయాత్ర ప్రజల హృదయాలలో ధైర్యం నింపిందంటూ తెలియజేశారు. ఈ పాదయాత్ర వల్ల ప్రజలకు నేనున్నాను అనే భరోసా కలిగిందని రాష్ట్ర ప్రజలు భారీగా మద్దతు పలికారని అందుకే ఆయనను ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారని తెలిపారు. అలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలలో ఉచిత విద్యుత్ పైన మొదటి సంతకం చేసి రైతులకు ఉపశమనం కలిగించారు.


అంతేకాకుండా వైయస్సార్ తీసుకువచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర రూపురేఖలనే మార్చాయంటూ రాసుకు వచ్చారు. మహిళలకు ఆర్థిక స్వలాభం కల్పించడం బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం వంటి చర్యలు కూడా ప్రజల జీవితాలలో చాలా మార్పులు తీసుకువచ్చాయని, విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాలలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు చాలామంది పేద పిల్లలు డాక్టర్లు, కలెక్టర్లు ఇంజనీర్లు కావడానికి దోహదపడ్డాయి అంటూ తెలిపారు జగన్. సాగునీటి ,తాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా తీసుకువచ్చారని తన తండ్రి వేసిన ముద్రను ఎవరూ చెరపలేరు అంటూ మాజీ సీఎం జగన్ తెలియజేశారు. ఈ పాదయాత్ర స్ఫూర్తితోనే తన ప్రయాణం కూడా కొనసాగుతుందని , రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 23 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇలా వ్యాఖ్యలు చేశారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: