సుధీర్ బాబు "హరోం హర" విడుదల తేదీ లాక్..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు తాజాగా "హరోం హారా" అనే మూవీ లో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తి అయింది. జ్ఞాన సాగర్ ద్వారక ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని లాక్ చేశారు.
 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సుధీర్ నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తూ వస్తున్నాయి.

కొంత కాలం క్రితమే ఈయన హంట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో సుధీర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర స్థాయిలో నిరత్సాహ పరిచింది. ఇక ఆ తర్వాత హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన మామ మచ్చింద్ర అనే సినిమాలో సుదీర్ హీరోగా నటించాడు.

ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో సుదీర్ నటించడంతో ఈ మూవీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో అని జనాలు అనుకున్నారు. కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్న సుదీర్ "హరోం హర" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మే 31 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: