నాగబాబు: ఓవరాక్షన్.. చురకలంటించిన ఈసీ..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజవర్గం ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రమంతట హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడం ముఖ్య కారణం గత ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేసిన పవన్ ఓడిపోవడంతో ఈసారి కచ్చితంగా గెలవాలని సినీ పరిశ్రమ మొత్తం దింపారు మెగా కుటుంబం.. అయితే ఇక్కడ ఆపోజిట్ గా వైసీపీ మహిళా నేత వంగా గీత నిలబడ్డారు.. ఇమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ కూడా జగన్ ఇచ్చారు.

పిఠాపురం నియోజవర్గంలో భారీ నగదు జరుగుతోందని వైసీపీ నేతలు ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలువురు జనసేన నేతలు మండిపడుతున్నారు.. ఈ విషయం పైన జనసేన కార్యదర్శి నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. వైసీపీ నేతలు రేపు అర్ధరాత్రి నుంచి నగదు పంపిణీ చేస్తున్నారని వైసీపీ గుండాలను రౌడీలను రంగంలోకి దింపారని వారు ప్రతి ఇంటికి డబ్బు అందించడంతోపాటు డబ్బు తీసుకున్నట్టు సీరమార్కు వేస్తున్నారంటూ వెల్లడించారు.. అయితే ఈ విషయం పైన నాగబాబుకు ఈసీ చురకలు అంటించింది.

నాగబాబు చేసిన ఈ ప్రకటన పైన ఎన్నికల కమిషనర్ సీరియస్ అవుతూ ఓటర్లు ఎడమ చేతి చూపుడువేలు పైన పెట్టే సిర ఇండియన్ ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుందని.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీద చాలా క్లారిటీతో ఇచ్చేశారు చెరగని సిరను భారత ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని కూడా వెల్లడించారు.. ఈ సిర ప్రభుత్వం వద్ద కాకుండా ఇతరుల వద్ద ఉందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కూడా వెల్లడించింది. దీంతో ఏదైనా ఆరోపణ చేసే ముందు వాటి గురించి తెలుసుకోవాల్సిన కనీస అవగాహన కూడా నాగబాబుకు లేకపోవడంతో ఇలాంటి విమర్శలకు కారణమవుతుందని పలువురు నేతలు సైతం తెలియజేస్తున్నారు.. కేవలం నాగబాబు వైసీపీని ఈ విమర్శించాలనే ఆత్రుతతో ఇలాంటి లాజిక్కులు లేకుండా మాట్లాడుతూ ఉండడంతో ఈసీతో చివాట్లు తింటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: