బ్యాక్ టూ బ్యాక్ బన్నీ తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?
దీంతో సోషల్ మీడియా అంతటా “బన్నీ – లోకేష్ కనగరాజ్” అనే పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ నుంచి సినీ విశ్లేషకుల వరకూ అందరూ ఈ కాంబినేషన్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ కనకరాజు అంటే యాక్షన్, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ గుర్తుకు వస్తాయి. అలాంటి దర్శకుడి విజన్‌లో అల్లు అర్జున్ కనిపిస్తే అది ఎలాంటి సినిమాగా రూపుదిద్దుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అల్లు అర్జున్ ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో మళ్లీ వెంటనే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయడం ఎందుకు? టాలీవుడ్ డైరెక్టర్లను పక్కన పెట్టి వరుసగా కోలీవుడ్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దీనికి వెనుక ఎలాంటి పెద్ద రహస్యాలు లేవట. లోకేష్ కనగరాజ్ - అల్లు అర్జున్‌కు చెప్పిన కథ, కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విధంగా ఒక పవర్‌ఫుల్, యూనిక్ క్యారెక్టర్‌ను లోకేష్ డిజైన్ చేశాడని సమాచారం. అందుకే దర్శకుడు ఎవరు అనే అంశం కంటే, కథలో ఉన్న కొత్తదనం, పాత్రలో ఉన్న బలం చూసుకుని అల్లు అర్జున్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కూడా గుర్తు చేస్తున్నారు. “డైరెక్టర్ తమిళ్ వాడా, తెలుగువాడా అన్నది కాదు… సినిమా కంటెంట్ బలంగా ఉంటే చాలు” అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మరోవైపు కొంతమంది అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో, స్క్రిప్ట్, టైమ్‌లైన్, ప్లానింగ్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సాత్వికంగా, పక్కా ప్రణాళికతో సినిమాను తెరకెక్కించాలంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి జానర్‌లో ఉండబోతుందో, అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్న అంశాలపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. మొత్తానికి బన్నీ అభిమానులకు రాబోయే రోజుల్లో పెద్ద సర్‌ప్రైజ్ ఉండబోతుందన్న అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి.