చిరంజీవి సినిమాపై విషం చిమ్మిన బిగ్ బాస్ బ్యూటీ.. నాన్సెన్స్ అంటూ రివ్యూ.!

Pandrala Sravanthi
ఈ మధ్య ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు రివ్యూవర్ గా మారిపోతున్నారు.. యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకొని కొత్త సినిమాలు విడుదలయితే చాలు తనదైన శైలి లో రివ్యూలు ఇస్తూ కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలను ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.కానీ ఈ సినిమాపై బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ అయినటువంటి దివ్య నిఖిత షాకింగ్ రివ్యూ ఇచ్చింది.దివ్య తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి మెగా అభిమానుల ఆగ్రహానికి గురైంది.మరి ఇంతకీ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి దివ్య ఏ విధంగా రివ్యూ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా దివ్య తన సోషల్ మీడియా ఖాతాలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ పై ఈ విధంగా రివ్యూ ఇచ్చింది.. 


చిరంజీవి సినిమాపై నా చిన్న రివ్యూ.. మీకు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నచ్చితే ఇది కూడా నచ్చుతుంది. కానీ అనిల్ రావిపూడి చేసిన పటాస్, ఎఫ్2,రాజా ది గ్రేట్ లాగానే సినిమా ఉండాలంటే ఈ మూవీ నచ్చదు. కుటుంబ కథా ప్రేక్షకులకు అయితే సినిమా నచ్చుతుంది. అయితే చాలామంది మెగా ఫ్యాన్స్ నా రివ్యూ చూసి కోప్పడతారు. మధ్యలో మీరెవరు చెప్పడానికి అంటారు. అందుకే ఇది నా ఒపీనియన్ మాత్రమే.సంక్రాంతికి ఏమీ లేని సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు. సినిమా అంత అద్భుతంగా అయితే లేదు. ఒకవేళ ఈ రివ్యూ నేను ఇవ్వకపోతే సినిమా చూసిన వాళ్ళు మీరు ముందే మాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అందుకే నా ఒపీనియన్ నేను పంచుకుంటున్నాను. ఈ సినిమాలో కూడా అన్ని సినిమాల్లాగే మదర్,ఫాదర్, హస్బెండ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. 


నాకు ఒకటి అర్థం కాదు భార్య భర్తల బంధం బ్రేక్ అయితే ఎప్పుడు భార్య సైడ్ బంధువులనే  ఎందుకు నిందిస్తారు.. నాన్సెన్స్.. ఇలాంటి సినిమాలనే జనం ఎందుకు ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు. ఇక నా రివ్యూ చూసి కొంతమంది నీకు సంక్రాంతికి రక్తపాతాలు, సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమాలు రావాలా అని అర్థం చేసుకుంటారు. కానీ సినిమా చూడటం చూడకపోవడం మీ ఇష్టం. బట్ ఈ మూవీ లేమ్ మూవీ.. అంటూ షాకింగ్ రివ్యూ ఇచ్చింది.ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై బిగ్ బాస్ దివ్య ఇచ్చిన రివ్యూ పై కొంతమంది మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కానీ నువ్వు పిల్ల బచ్చావి నీకేం తెలుసు  మెగాస్టార్ సినిమా వాల్యూ అంటూ మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: