రక్షణ మూవీతో పాయల్ రాజ్ పుత్ కు బ్లాక్ బస్టర్ ఖాయమా.. పోస్టర్ అదుర్స్ అంటూ?

Reddy P Rajasekhar
తెలుగులో తక్కువ సినిమాలే చేసినా పాయల్ రాజ్ పుత్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఆర్.ఎక్స్100, మంగళవారం సినిమాలతో పాయల్ రాజ్ పుత్ కు మంచి పేరు వచ్చింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’ మూవీ టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ కాగా ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.
 
ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుండగా హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు భిన్నమైన సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసాంతం కట్టిపడేసే కథ, కథనంతో ఈ మూవీ తెరకెక్కుతోందని భోగట్టా.
 
నటిగా ఈ సినిమాతో పాయల్ కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారని ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. పాయల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: