మ్యాగీ నూడిల్స్.. ప్రాణం తీసాయ్.. ఏం జరిగిందంటే?

praveen
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయ్. ఇలాంటి మార్పులు ఇక ప్రతి పనిని కూడా సులభతరం చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకప్పుడు మనిషి పౌష్టికాహారం తినడానికి ఆశక్తి చూపించేవాడు. కానీ ఇప్పుడు ఇక రుచికరంగా ఉంటే చాలు ఏది తినడానికైనా సిద్ధం పడిపోతున్నాడు. మరి ముఖ్యంగా కనీసం తిండి కోసం కాస్తయినా సమయాన్ని కేటాయించని మనిషి.. సులభమైన దారులను వెతుకుతున్నాడు.

 ఇలా టైం లేని వాళ్లకోసం ఇన్స్టంట్ గా తయారయ్యే ఆహారం ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ నూడిల్స్ మాత్రమే అని చెప్పాలి. కేవలం రెండు నిమిషాల్లోనే మ్యాగీ నూడిల్స్ రెడీ అవుతాయి. ఇక నేటి రోజుల్లో చాలామంది జనాలు వీటికి బాగా అలవాటు పడిపోయారు. ఇక ఎప్పుడు సమయం లేకపోయినా మ్యాగీ నూడుల్స్ ని చేసుకుని తినడం చేస్తున్నారు. అయితే ఇది అటు ఆరోగ్యానికి మంచిది కాదు అని వైద్యులు హెచ్చరిస్తున్న జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇలా తక్కువ సమయంలోనే వంటకం పూర్తయ్.. అందరి కడుపు నింపుతున్న మ్యాగీ నూడుల్స్ ఇక్కడ ఏకంగా ప్రాణం పోవడానికి కారణమైంది .

 అదేంటి మ్యాగీ నూడిల్స్ తినడం కారణంగా ప్రాణాలు పోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి షాకింగ్ ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది. మ్యాగీ నూడిల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. పిలిభిత్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం నూడిల్స్ ని అన్నంతో పాటు తిన్నారు. అయితే ఇదే ఫుడ్ పాయిజన్ కు దారితీసిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో బాలుడు మరణించగా మిగిలిన వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులు అందరూ కూడా పురాన్పూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: