ఏపీలో గెలిచేది వైసీపీనే.. సీఎం జగనే.. తిరిగేది ఫ్యానే.. ఎనీ డౌట్స్!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సంకోచం, సందేహం అవసరం లేకుండా వైసీపీనే అని సమాధానం వినిపిస్తోంది. ఏపీలో జగన్ మళ్లీ సీఎంగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని గత ఐదేళ్ల పాలనలో సంక్షేమం చూపించిన జగన్ రాబోయే ఐదేళ్లలో అభివృద్ధికి అసలు అర్థం చెప్పబోతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ ఒంటరి వాడైనా తనకు ఏపీ ప్రజల అండ జగన్ కు పుష్కలంగా ఉందని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూటమి నేతలకు జగన్ పవర్ ఏంటో అర్థం కానుందని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో మళ్లీ తిరిగేది ఫ్యాన్ అని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో జగన్ కు లక్ కూడా కలిసొస్తోందని తెలుస్తోంది.
 
కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడమే జగన్ కు వరం కానుందని తెలుస్తోంది. కూటమి పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా పొరపాట్లు చేస్తోందని భోగట్టా. గత ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయం పాలవడంతో ఈ ఎన్నికల్లో కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా నియోజకవర్గాల్లో పుంజుకోలేదని తెలుస్తోంది. వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాల్లో కూటమికి షాక్ తప్పదని భోగట్టా.
 
వైసీపీ కంచుకోటల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ ఎన్నికల్లో కూటమి ప్రభావం చూపే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఫ్యాన్ మరింత స్పీడ్ గా తిరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుసగా పదేళ్ల పాటు సీఎంగా పని చేసిన అరుదైన రికార్డును జగన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి సొంతం చేసుకుంటారేమో చూడాలి. వైసీపీ నేతలు చాలా నియోజకవర్గాల్లో సులువుగానే అధికారాన్ని సొంతం చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. జగన్ తన వ్యూహాలతో మళ్లీ సీఎం కుర్చీని సొంతం చేసుకోనున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: