గుంటూరు: టీడీపీ ' భాష్యం ప్ర‌వీణ్ ' సూప‌ర్ విక్ట‌రీ కొట్టేసిన‌ట్టేనా ?

RAMAKRISHNA S.S.
రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ముఖ్యంగా ఎన్నిక‌ల బ‌రిలో పోటీ చేస్తున్న‌వారికి.. ఒక్కొక్క‌రికి ఒక్కొక్క బ‌లం ఉంటుంది. కొంద‌రు పేద‌ల‌ను ఆక‌ట్టుకుంటారు. మ‌రికొంద‌రు మ‌హిళ‌ల ఓటు బ్యాంకును సొంతం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇంకొంద‌రు.. వీరితో పాటు.. రైతుల‌ను కూడా ఆక‌ట్టుకుంటారు. ఇక‌, సిట్టింగు నాయ‌కులైతే.. త‌మ ప్ర‌బుత్వం చేసిన మంచిని ప్ర‌చారం చేసుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతారు.

ఇదే విధంగా గుంటూరు జిల్లా పెదకూర‌పాడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భాష్యం ప్ర‌వీణ్‌కు కూడా.. రెండు కీల‌క వ‌ర్గాలు అండగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీ టికెట్ పై ఉమ్మ‌డి పార్టీల అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఈయ‌న విజ‌యం కోసం.. ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఈయ‌న‌కు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, వివిధ పారిశ్రామిక వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

అదే స‌మ‌యంలో యువ‌తను ఎక్కువ‌గా ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. టీడీపీవ‌స్తే.. 20 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు ఇస్తామ‌ని.. చంద్ర‌బాబు తొలి సంత‌కం.. మెగా డీఎస్సీపైనే ఉంటుంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చేస్తున్న ప్ర‌చారం యువ‌త‌ను బాగానే ఆక‌ర్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 శాతం మంది యువ ఓట‌ర్లు.. కొత్త‌గా ఓటు హ‌క్కు పొందిన వారు మ‌రో 5శాతం మంది ఉన్నారు. వీరి ఓట్లు ప్ర‌వీణ్‌కు ప‌డే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది.

ఇక‌, మ‌రో ఓటు బ్యాంకు విద్యావంతులు. వీరు కూడా.. భాష్యం ప్ర‌వీణ్‌ కే జై కొడుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. వీరి ఓటు బ్యాంకు కూడా బాగానే ఉండ‌డం.. వైసీపీ పాల‌న‌తో విసిగిపోయి ఉండ‌డం వంటివి ప్ర‌వీణ్‌కు క‌లిసి వ‌స్తున్న అంశాలు. వీరిద్ద‌రి ఓటు బ్యాంకుతోపాటు.. రాజ‌ధాని కోరుకునే వారి ఓటు బ్యాంకు కూడా ప్ర‌వీణ్‌కు క‌లిసి వ‌స్తున్న అంశం. ఇక క్లీన్ ఇమేజ్ తో ఫ‌స్ట్ టైం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి వ‌ర్గం స‌పోర్ట్ చేస్తుండ‌డం ఇవ‌న్నీ ప్ర‌వీణ్ గెలుపును ముందుగానే డిసైడ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: