తెలంగాణ ఎన్నికలు.. పోటీలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

praveen
తెలంగాణలో ఎన్నికల హడావిడి చివరి ఘట్టానికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుంచి గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ముమ్మర ప్రచారం చేశాయి. ఈ క్రమంలోనే హామీల వర్షం కురిపిస్తూ తమను గెలిపించాలి అంటూ ఓటర్లను అభ్యర్థించాయి ఆయా పార్టీలు. ఈ క్రమంలోనే ఎన్నో హామీల వర్షం కూడా కురిపించాయ్. ఈసారి ఎన్నికల్లో మాదే విజయం అంటే మాదే విజయం అంటూ అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ధీమాతో ఉన్నారు.

 ఇటీవల ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. దీంతో ఒక్కసారిగా నిన్నటి వరకు ప్రచార హోరుతో మారుమోగిపోయిన మైకులన్ని మూగబోయాయ్. ఇక రేపు ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగబోతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం కారణంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరుగుతుండడం గమనార్హం.

 అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఎంత మంది పోటీ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మొత్తంగా అన్ని స్థానాలు కలుపుకొని 425 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. 3.17 కోట్ల మంది ఓటర్లు ఇక అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చబోతున్నారు. కాగా అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 45 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35609 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది సమస్య జరగబోతుంది. సమస్యాత్మక ప్రాంతాలలో నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: